
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దాడుల కారణంగా పశ్చిమాసియాలో వందల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. గత నెల 28న ప్రారంభమైన యుద్ధం నేటితో ఏడవ రోజుకు చేరుకున్నది. ఈ యుద్ధంలో అత్యధికంగా ఇరాన్‌లో చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. ఇరాన్‌లో 181 మంది, లెబనాన్‌లో 7గురు, ఇజ్రాయెల్‌లో ముగ్గురు, కువైట్‌లో ఒకరు మృతి చెందినట్లు వెల్లడించింది.
యుద్ధాలను పిల్లలు ప్రారంభించరని కానీ వారు కూడా మూల్యం చెల్లించుకుంటున్నారని పిల్లల హక్కులు, ఆరోగ్యం, విద్య, సంక్షేమం కోసం పనిచేసే ఈ ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ఆవేదన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలు ఇప్పటికే చిన్నారులపై ఆందోళనకర ప్రభావాన్ని చూపిందని పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త ఆపరేషన్‌లో మొదటి రోజు ఇరాన్‌లోని మినాబ్‌లో ఒక బాలికల పాఠశాలపై దాడి జరగగా, 160 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

