
అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తోన్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఈ పడవ దక్షిణ బంగ్లాదేశ్ లో టేక్‌నాఫ్ ప్రాంతం నుంచి బయల్దేరినట్లు ఈ ప్రకటనలో ఐరాస అధికారులు పేర్కొన్నారు. మలేసియా వెళ్తుండగా బలమైన ఈదురుగాలులు, కెరటాల ఉద్ధృతి కారణంగా మునిగినట్లు వెల్లడించారు. కాగా.. ఈ పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించారని, అది కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

