శ్రీకాకుళంలో తీవ్ర విషాదం; నాగావళి నదిలో ముగ్గురు పిల్లలు గల్లంతు

శ్రీకాకుళంలో తీవ్ర విషాదం; నాగావళి నదిలో ముగ్గురు పిల్లలు గల్లంతు

శ్రీకాకుళంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెల్లివీధి సమీపంలో నాగావళి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. అరుగు వర్షిత్ అనే బాలుడిని స్ధానికులు రక్షించారు. గల్లంతైన వారిలో కోనా కార్తికేయ, కోనా గణేష్ గౌతం అనే ఇద్దరు బాలురు మృతి చెందారు. ఘటనాస్ధలానికి పోలీసులు చేరుకుని మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెల్లివీధిలో జరిగే పుట్టినరోజు వేడుకల కోసం విశాఖపట్నం ఎన్‌ఏడీ నుంచి వచ్చారు.

Next Story