
By - jyotsna |21 March 2024 2:45 PM IST
తాలిబన్ పాలిత దేశం ఆఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. గురువారం ఉదయం కాందహార్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు స్వదేశీయులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రావిన్స్ అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో కొందరు స్థానికులు తమ జీతాలను తీసుకునేందుకు సెంట్రల్ కాందహార్ నగరంలోని న్యూ కాబూల్ బ్యాంక్ బ్రాంచ్ వెలుపల వేచి ఉన్నట్లు తెలిపారు. వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఈ ఘటనలో ముగ్గరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడినట్లు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com