Operation Akhal: మూడో రోజు ఆపరేషన్‌ అఖల్‌.. ఆరుగురు ఉగ్రవాదులు హతం

Operation Akhal: మూడో రోజు  ఆపరేషన్‌ అఖల్‌.. ఆరుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల అంతుచూసేందుకునే భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌ అఖల్‌ (Operation Akhal) మూడో రోజుకు చేరింది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఆరుగురు ముష్కరులు హతమయ్యారు. ఓ జవాన్‌ గాయపడ్డారు. ఆపరేషన్‌ అఖల్‌ శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కుల్గాం జిల్లాలోని అఖల్‌ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు ఆగస్టు 1న గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య శనివారం రోజంతా కాల్పులు కొనసాగాయాయి. ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరోవైపు ముష్కరుల కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ గాయపడ్డారు. మృతులు ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు (TRF) చెందినవారని అధికారులు తెలిపారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి టీఆర్‌ఎఫ్‌ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించారు.

Next Story