
గుజరాత్‌లో వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోర్‌బందర్‌లో భారత నౌకా దళంయాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATSనార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి 3 వేల 300 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశాయి. ఈ డ్రగ్స్‌ను ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి భారత్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. నౌకలో 3 వేల 300 కిలోల డ్రగ్స్‌ను తరలిస్తుండగా పట్టుకున్నామని వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వేల కోట్లు ఉంటుందని.. అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో అయిదుగురిని అరెస్ట్ చేశామని అందులో నలుగురు ఇరానీయులు ఉన్నారని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అరేబియా సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com