90వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోన్న యువగళం

90వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోన్న యువగళం

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర అశేష జనవాహిని మధ్య ఉత్సాహంగా కొనసాగుతోంది. పాణ్యం నియోజకవర్గంలో లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.. జై టీడీపీ, జై లోకేష్‌ నినాదాలతో పాణ్యం దద్దరిల్లింది. ఇవాళ 90వ రోజు పాదయాత్ర పెద్ద కొట్టాల నుంచి ప్రారంభం అయింది. లోకేష్‌తో సెల్ఫీలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపడ్డారు..అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు. కే. మార్కాపురంలో కురుబ సామాజిక వర్గీయులతో లోకేష్‌ భేటీ అయ్యారు .


Next Story