వివాదాస్పదమైన డంపింగ్‌ యార్డు

వివాదాస్పదమైన డంపింగ్‌ యార్డు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో డంపింగ్‌ యార్డు వివాదాస్పదంగా మారింది. డంపింగ్ యార్డుతో స్థానికులు రోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డు పక్కనే కాలేజీలు ఉండటంతో విద్యార్థులు సైతం సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెత్తను కాల్చడం వల్ల వచ్చే పొగతో కాలనీ ప్రజలు ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. మున్సిపల్ పరిధిలోని 32 వార్డుల చెత్తను తమ కాలనీల పమీపంలోనే వేస్తున్నారని మండిపడుతున్నారు.

Next Story