ఆదోనిలో చెరువును తలపిస్తున్న జగనన్న కాలనీ

ఆదోనిలో చెరువును తలపిస్తున్న జగనన్న కాలనీ

కర్నూలు జిల్లా ఆదోనిలోని జగనన్న కాలనీ చెరువును తలపిస్తోంది. కాలనీలో మొత్తం పది వేల మందికి ప్రభుత్వం స్థలాలను మంజూరుచేసింది. లోతట్టు ప్రాంతం కావడంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి ముందుకురాలేదు. కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్మితమవుతోన్న ప్రభుత్వ వాటా లక్షా 50 వేలు, లబ్ధిదారుని వాటా 35 వేలు, ఉపాధి హామీ కింద 30 వేలు కలిపి మొత్తం 2 లక్షల 15 వేలు ఖర్చుచేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు లేఅవుట్‌లోని నిర్మాణాల్లోకి మోకాళ్ల లోతుకు నీరు చేరింది.

Next Story