
By - Chitralekha |10 July 2023 3:55 PM IST
రాయలసీమ హక్కులను పరిరక్షించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో రాయలసీమ భవిష్యత్తు-సమాలోచన పేరుతో అఖిలపక్ష సమావేశం జరిగింది. వైసీపీ నాలుగేళ్ల పాలనపై పార్టీల నేతలు తీవ్రంగా విమర్శించారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తన ఆస్తులను కాపాడుకునేందుకు జగన్ ఏపీని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టారని కాల్వ ఆరోపించారు. అన్ని పార్టీలతో కలిసి జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని కాల్వ శ్రీనివాసులు అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com