AP RAINS: వణికిస్తున్న..కుండపోత వర్షాలు

AP RAINS: వణికిస్తున్న..కుండపోత వర్షాలు

అల్లూరి మన్యం జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి.కుండపోతగా కురుస్తున్న వర్షాలతో విశాఖ - కిరండూల్‌ కేకే లైన్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. కరక వలస, బొర్రా గుహలకు మధ్య రైల్వే ట్రాక్‌పై బండరాళ్లు పడ్డాయి. దీంతో విద్యుత్ లైన్లు తెగిపోయి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైళ్లను రైల్వే స్టేషన్ యార్డ్‌లోనే నిలిచిపోయాయి. కిరండూల్ నుంచి విశాఖ వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా అధికారులు నిలిపివేశారు. యుద్ధ ప్రాతిపదికన రైల్వే అధికారులు విద్యుత్ లైన్లు, రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.

Next Story