HYD: అమ్మెనియా గ్యాస్ లీక్‌

HYD: అమ్మెనియా గ్యాస్ లీక్‌

హైదరాబాద్‌ ఫతేనగర్‌లో అమ్మెనియా గ్యాస్ లీక్‌ అవడంతో 15మంది అస్వస్థతకు గురయ్యారు. పైప్‌లైన్ రోడ్డులోని చెత్తకుప్పంలో ఉన్న రెండు గ్యాస్‌ సిలిండర్ల ఇత్తడి వాల్వ్‌లు ఓ దొంగ తీసే యత్నం చేశాడు. ఈ క్రమంలోనే సిలిండర్‌ నుంచి భారీగా అమ్మోనియా గ్యాస్‌ లీక్ అవ్వడంతో దొంగ అక్కడి నుంచి పరార్ అయ్యాడు. గాల్లో 15మీటర్లకు పైగా అమ్మోనియా గ్యాస్ వ్యాపించడంతో పక్కనే ఉన్న కంపెనీలో పని చేస్తున్న బీహార్ కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story