ఉపాధ్యాయులపై వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరి

ఉపాధ్యాయులపై వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరి

వైసీపీ ప్రభుత్వం తమపై మొండి వైఖరితో ముందుకు వెళుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, జీవో నెంబర్ 117 రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. తమ సమస్యల కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వాపోయారు.

Next Story