రణబీర్‌ కపూర్‌ అభిమానులకు నిరాశ

రణబీర్‌ కపూర్‌ అభిమానులకు నిరాశ


రణబీర్‌ కపూర్‌ అభిమానులకు మరోసారి నిరాశ చెందారు. అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న రణబీర్‌ కపూర్‌ మూవీ యానిమల్‌ డిసెంబర్ 11న విడుదల కానుంది. వాస్తవానికి ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ కావాలి. అయితే… ఆగస్టులో సన్నీ డియోల్‌ తీస్తున్న గదర్‌ సీక్వెల్‌తో పాటు అక్షయ్‌ కుమార్‌ నటించిన ఓఎంజీ సీక్వెల్‌ మూవీలు విడుదల అవుతున్నాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. యానిమల్‌ మూవీని డిసెంబర్‌ నెలలో విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ వెల్లడించింది. సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఇంకా పూర్తి కాలేదని... దీంతో సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Next Story