
By - Vijayanand |15 April 2023 4:10 PM IST
సత్యసాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం పులకించి పోయింది. కేరళ నూతన సంవత్సర సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆధ్యాత్మికత వెల్లువిరిసింది. వేలాది మంది మలయాళ భక్తులు ప్రశాంతి నిలయం చేరుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి మహాసమాధిని మలయాళ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో అలంకరించారు. అనంతరం కేరళ భక్తుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. కుల్వంత్ మందిరంలో సత్యసాయిని కీర్తిస్తూ భక్త బృందం సభ్యులు నిర్వహించిన కచేరీ అలరించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com