
గుంటూరు జిల్లాకు చెందిన ఓ నేత నగ్న వీడియోకాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ పార్టీకే చెందిన ఓ మహిళతో ఆయన వీడియోకాల్‌లో మాట్లాడుతూ అందులో నగ్నంగా కనిపించారు. ఈ వ్యవహారం పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణ చేసి.. పార్టీ పెద్దలకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ పార్టీ జిల్లా ముఖ్య నేత నగ్న వీడియో కూడా కలకలం రేపింది. దీని వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలకు చెందిన రెండు నగ్న వీడియోలు బయటకు రావడంతో కమలం పార్టీ ఉలిక్కిపడింది. రెండు వీడియోలు సోషల్ మీడియాలో రావడం వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. 2022వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అప్పట్లో అది ఫేక్ వీడియో అని పోలీసుల విచారణలో తేలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com