
By - Dayakar |6 Feb 2025 2:52 PM IST
పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతను మరింతగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పిల్లలకు సన్న బియ్యం (ఫైన్ రైస్) అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది.
పోషక విలువలు అధికంగా ఉండే సన్న బియ్యం పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మద్దతు తెలిపారు. కావలసిన పోషక విలువలతో కూడిన సన్న బియ్యం తమ శాఖ వద్ద అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com