ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో జరగుతోన్న వ్యవహారంపై అంతా నోరువిప్పాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికత.. హిందుత్వంపై సోషల మీడియా వేదికగా ఎక్స్ లో పవన్ కల్యాణ్ ఓ పోస్ట్ పెట్టారు. దేవాలయాలు, సైన్స్ మధ్య ఉన్న బంధాన్ని భారత చరిత్ర, దేశ సంస్కృతుల్లో కనపడుతూనే ఉంటాయన్నారు. ఆలయాలకు.. ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాల మధ్య సంబంధం స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నారు. వివిధ ప్రదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనల్ని అనుసంధానం చేస్తుందన్నారు. ఆలయాలు వాటి గోడలలో కూడా తరతరాలుగా జ్ఞానం నిక్షిప్తమై ఉందని పవన్ అన్నారు. సంస్కృతి, విజ్ఞానానికి కేంద్రాలుగా దేవాలయాలు భాసిల్లేవనే గుర్తుచేశారు. ఆలయాలు సైన్స్, ఆధ్యాత్మిక రంగాలను ఏకీకృతం చేసేవి.. అంతరాలను తగ్గించేవి అంటూ తన ట్విట్టర్ హ్యాడిల్‌లో ఓ వీడియోను జనసేన అధినేత షేర్ చేశారు .
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com