రెండో రోజు చేరిన ఏపీ విద్యుత్ ఉద్యోగుల నిరసన

రెండో రోజు చేరిన ఏపీ విద్యుత్ ఉద్యోగుల నిరసన

తమ డిమాండ్లను నెరవేర్చాలని ఏపీ విద్యుత్ ఉద్యోగుల నిరసన రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని VTPS గేటు ముందు విద్యుత్ ఉద్యోగులు బైఠాయించి నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు పెండింగ్ డీఏ లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంచెలంచెలుగా నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు చెప్పారు. సమస్యలు పరిష్కారమవకపోతే ఆగష్టు 10నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

Next Story