ఏపీలో భారీగా పన్నుల బాదేస్తున్న జగన్ సర్కారు

ఏపీలో భారీగా పన్నుల బాదేస్తున్న జగన్ సర్కారు

ఏపీలో జగన్ సర్కారు జనాన్ని పన్నులతో బాదేస్తోంది. ఇప్పటికే కరెంట్ ఛార్జీలతో షాకిస్తోన్న వైసీపీ సర్కారు.. ఇప్పుడు ఇంటి పన్నుతో కొరడా ఝుళిపిస్తోంది. ఇబ్రహీంపట్నంలోని ఓ రేకుల షెడ్డుకు ఏకంగా 3400 రూపాయలు ఇంటి పన్ను వేసింది. గతంలో కేవలం 200 రూపాయలు ఉన్న ఇంటి పన్ను ఏకంగా... 3వేల 400 రూపాయలు వేయడంతో.. లబోదిబో మంటున్నాడు బాధితుడు. రేకుల షెడ్డుకు.. ఇంత భారీగా ఇంటి పన్ను వేయడమేంటని ప్రశ్నిస్తున్నాడు. క్రాంతి, నీరజ దంపతులు.

ఇబ్రహీంపట్నంలో ఓ రేకుల షెడ్డులో ఉంటున్నారు క్రాంతి, నీరజ దంపతులు. ఎలాంటి సౌకర్యాలు లేని ఈ ఇంటికి 3400 రూపాయల ఇంటి పన్ను వేయడంతో.. షాక్ కు గురయ్యారు. దీనిపై కొండపల్లి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. వాస్తవానికి ఎస్సీలకు 200 యూనిట్లు లోపు కరెంట్ ఉచితంగా ఇస్తుంది. బాధితులు ఎస్సీ అయినా ప్రతినెలా కరెంట్ బిల్లు కట్టడం విశేషం. కనీసం ఈ రేకుల షెడ్డుకు మౌలిక సదుపాయాలు కూడా లేవు.

ఏ సదుపాయాలు లేని ఈ రేకుల షెడ్డుకు వేల రూపాయల ఇంటి పన్ను విధించడం, ఎస్సీలకు ఉచితంగా ఇచ్చే కరెంటే చార్జీలు కూడా వసూలు చేయడం పై మండిపడుతున్నాయి విపక్షాలు. రెక్క ఆడితే కానీ.. డొక్కాడని తాము...ఇంత ఇంటి పన్ను ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.

Next Story