పంచాయతీ నిధులు స్వాహా చేస్తున్న జగన్‌ సర్కార్‌

పంచాయతీ నిధులు స్వాహా చేస్తున్న జగన్‌ సర్కార్‌

గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను వైసీపీ ప్రభుత్వం సొంతానికి వాడుకుంటోందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంటే కేంద్ర పెద్దలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడ బాలోత్సవ భవన్‌లో ఏపీ సర్పంచుల సంఘం, ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సర్పంచుల సదస్సు నిర్వహించారు. తాము ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడితే కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీలకు కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిందని తేల్చిందన్నారు. అయినా నేటికీ వైసీపీ ప్రభుత్వంపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. వైసీపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు సైతం సీఎం జగన్ తీరును వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

Next Story