ఇంధన ధరల్లో టాప్‌ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్‌

ఇంధన ధరల్లో టాప్‌ ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్‌

దేశవ్యాప్తంగా ఇంధన ధరల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. ఈ విషయాన్ని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీలో పెట్రోల్‌ ధర 111 రూపాయల 87 పైసలు కాగా.. డీజిల్‌ ధర 99 రూపాయల 61 పైసలుగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్‌ ధర ఎక్కువ కాగా.. డీజిల్‌ ధరల్లో రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరల్ని అమరావతి కేంద్రంగానే సేకరించినట్లు కేంద్రమంత్రి పార్లమెంట్‌లో చెప్పారు.

Next Story