మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకున్నది. దీంతో ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ దళాల్ని మోహరించారు. మైతీ తెగలకు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడర్ ఓ సీనియర్ పోలీసు అధికారిని అపహరించడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే పోలీసు, సెక్యూర్టీ బలగాలు తక్షణమే స్పందించిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అదనపు ఎస్పీ అమిత్ కుమార్‌ను ఆ దళాలు కాపాడాయి. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం క్షేమంగా ఉంది. మంగళవారం రాత్రి ఏడు గంటలకు కిడ్నాప్ ఘటన చోటుచేసుకున్నది. ఇంపాల్ ఈస్ట్‌లో ఉన్న కుమార్ ఇంటిపై మైతీ తెగ అటాక్ చేసినట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నాలుగు రోజుల క్రితం బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ధనమంజురి యూనివర్సిటీ ప్రాంగణంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్యాంపస్‌లో ఉన్న ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ కార్యాలయం వద్ద పేలుడు ఘటన చోటు చేసుకుంది. .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com