
లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఇండియా కూటమిలోని భావసారూప్యమున్న పార్టీలతో సీట్ల సర్దుబాటు తదితర విషయాలపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ-CWC ఇవాళ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన దిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు మిగిలిన CWC సభ్యులు హాజరుకానున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇవాళ మధ్యాహ్నాం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై సీడబ్ల్యూసీ చర్చించనుంది.
కీలక రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, మంత్రి దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డిలూ సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొననున్నారు. కాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకున్నారు. ఢిల్లీకి వెళ్తున్నందున దానిని వాయిదా వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com