అన్నమయ్య జిల్లాలో గుర్తు తెలియని దుండగులు తుపాకీతో హల్ చల్ చేశారు. పీలేరు మండలం ఓంటిల్లులో టీడీపీ నాయకుడు గిరి నాయుడు ఇంట్లోకి 10 మంది దుండగులు చొరబడి గన్‌తో ఆయనను బెదిరించి దాడి చేశారు. వారిని ప్రతిఘటించిన గిరి తుపాకీ లాక్కోగా నిందితులు బైకుపై పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
మరో ఘటనలో....
హైదరాబాద్‌లో అక్కా తమ్ముడు అదృశ్యమయ్యారు. కొండాపూర్ మసీద్ బండ ప్రభుపాధ కాలనీలో ఉంటున్న నరేష్ 2022లో తన మేనకోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో ఆమెతోపాటు ఆమె తమ్ముడు 19 ఉండేవారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న అక్కా తమ్ముడు అదృశ్యమయ్యారు. తమ కోసం వెతికితే చనిపోతామని లేఖ రాసి పెట్టారు. నరేష్ వారి గురించి గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com