
అయోధ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు అంతకుమించిన ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయాన్ని విభిన్న కళాకృతులతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామ మందిరం తలుపులు హైదరాబాద్‌లోని బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపో ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. జూన్‌లో తలుపుల తయారీ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి 60మందికిపైగా కళాకారులు అయోధ్యకు వెళ్లారు. తలుపుల తయారీకోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. మహారాష్ట్రలోని బలార్హకు చెందిన టేకు ఉపయోగిస్తున్నారు. బంగారు పూతతో కూడిన 18 ప్రధాన ద్వారాల తలుపులతోపాటు మరో 100 తలుపులను తయారు చేస్తున్నారు.
అయోధ్యలోని రామమందిర ప్రాంగణానికి అవసరమైన తలుపుల తయారీలో నాణ్యమైన కలపను ఉపయోగిస్తున్నామని అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ అధిపతి శరత్ బాబు తెలిపారు. నిపుణులైన కళాకారులతో రామాలయం తలుపులను తయారు చేయిస్తున్నట్లు వెల్లడించారు. అందుకోసం అయోధ్యలోనే ఓ ఫ్యాక్టరీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయోధ్య రామమందిరం ప్రారంభమైనా...ఏడాది వరకు పనులు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. తమ శిల్పకళ చాలా బాగుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అభినందించారని పేర్కొన్నారు. ఇంతగొప్ప అవకాశం తమకు లభించటం గర్వంగా ఉందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com