High Court: భారత్‌ మాతా కీ జై అంటేనే బెయిల్‌.. నిందితుడికి తిక్క కుదిర్చిన హైకోర్టు

High Court: భారత్‌ మాతా కీ జై అంటేనే బెయిల్‌.. నిందితుడికి తిక్క కుదిర్చిన హైకోర్టు

భారత వ్యతిరేక, పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేసిన ఓ నిందితుడికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు తిక్క కుదిర్చింది. అతడికి బెయిలు మంజూరు చేస్తూ ఊహించని షరతులు విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది మే 17న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. భోపాల్‌ సమీపంలోని మిస్రోద్‌లో ఓ పంక్చర్‌ షాప్‌ నిర్వహించే ఫైసల్‌ఖాన్‌ ఆ వీడియోలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌”, ‘భారత్‌ ముర్దాబాద్‌’ అని నినాదాలు చేయడం కనిపించింది. దీంతో అతడిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫైసల్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు.

ఈ కేసులో తాజాగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ పలివాల్‌ అతడికి బెయిలు మంజూరు చేస్తూ.. ఫైసల్‌ తన దేశభక్తిని బహిరంగంగా ప్రదర్శించాలని షరతు విధించారు. జాతీయ జెండాకు 21సార్లు వందనం చేయాలని, నెలకు రెండుసార్లు ‘భారత్‌ మాతా కీ జై’ అని నినదించాలని షరతులు పెట్టారు. కేసు ముగిసే వరకు ప్రతినెల మొదటి, నాలుగో మంగళవారం మిస్రోద్‌ పోలీస్‌ స్టేషన్‌లోని జెండా స్తంభం వద్ద ఇలా చేయాలని ఆదేశిస్తూ ఫైసల్‌కు బెయిలు మంజూరు చేశారు.

Next Story