కాకినాడలో భవిష్యత్తుకు గ్యారెంటీ

కాకినాడలో భవిష్యత్తుకు గ్యారెంటీ

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథ యాత్ర ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, పార్లమెంటరీ అధ్యక్షులు జ్యోతుల నవీన్‌ ఆధ్వర్యంలో బస్సు యాత్ర షురూ అయ్యింది. అంతకుముందు టీడీపీ హయాంలో నిర్మించిన మోడల్‌ డిగ్రీ కాలేజ్‌, నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియంతో పాటు కళ్యాణ మండపాన్ని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథ యాత్ర ద్వారా వైసీపీ వైఫ్యల్యాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. సీఎం జగన్ అరాచకాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

Next Story