
బిహార్‌లోని కారాకట్ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్‌పురి గాయకుడు, నటుడు పవన్‌సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా తల్లీకుమారుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ జూన్ 1న చివరిదశలో పోలింగ్ జరగనుండగా.. నామినేషన్లకు మంగళవారం తుది గడువు. తొలుత పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గానికి భాజపా అభ్యర్థిగా పవన్‌సింగ్ పేరును ఆ పార్టీ ప్రకటించింది. అయితే.. తన పాటలపై ఇటీవల తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని చెప్పి, సొంత రాష్ట్రం బిహార్‌లోని కారాకట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో ఎన్డీయే అభ్యర్థిపై ఇండిపెండెంట్‌గా పోటీ చేయడాన్ని భాజపా తీవ్రంగా పరిగణించింది. పోటీ నుంచి వైదొలగాలనీ, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. తాజాగా అదే నియోజకవర్గం నుంచి ఆయన తల్లి పోటీకి దిగడం విశేషం. కాగా, ఈ ఎన్నికల్లో బెంగాల్‌లోని అసన్‌సోల్ బీజేపీ టికెట్‌ను తిరస్కరించిన పవన్ సింగ్ తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించి నామినేషన్ వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com