నిమ్స్‌ ఆస్పత్రి నూతన భవనానికి రేపే భూమిపూజ

నిమ్స్‌ ఆస్పత్రి నూతన భవనానికి రేపే భూమిపూజ

హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రి కొత్త బిల్డింగ్‌ నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎర్రమంజిల్ క్వాటర్స్‌ స్థలంలో కొత్త బిల్డింగ్‌ నిర్మాణం చేపడుతున్నారు. కొత్త బిల్డింగ్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ రేపు భూమి పూజ చేయనున్నారు. మొత్తం 32.16 ఎకరాల్లో నిమ్స్ ఆస్పత్రికి అనుబంధంగా కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణం పూర్తి అయితే మరో 2వేల పడకలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం నాలుగు వేల పడకలతో నిమ్స్‌ దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రికి అవతరించనుంది.

Next Story