
By - Chitralekha |18 July 2023 4:47 PM IST
నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణక్రాకలో రైతు భరోసా కేంద్రంలో భారీ అవినీతి వెలుగు చూసింది. 2022 వరి పంటనష్టంపై విలేజీ అగ్రికల్చర్ అసిస్టెంట్, వాలంటీర్లు చేతివాటం ప్రదర్శించారు. సుమారు కోటి రూపాయల మేర రైతుల డబ్బులు పక్కదారి పట్టించారు. వాలంటీర్ల బంధువుల అకౌంట్‌లోకి లక్షల రూపాయలు మళ్లించినట్లు తేలింది. విషయం భయటపడకుండా ఉండేందుకు రైతులకు ఐదు లక్షల రూపాయలను VAA ప్రత్యూష ఎరగా చూపించారు. నిజమైన రైతులకు పంట నష్టం అందకపోవడంతో రైతు భరోసా కేంద్రం ముందు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com