చావుకి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాడు

బైకు ప్రయాణం అంటే మజా ఎంతుంటుందో ప్రమాదం కూడా అంటే ఉంటుంది. మరీ కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ మాత్రం వాహనదారుడు అప్రమత్తంగా లేకపోయినా గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. తాజాగా ఓ బైకర్ మృత్యువు అంచులవరకు వెళ్లి వచ్చాడు. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలోని నార్కోటా సమీపంలో 200 మీటర్ల లోతైన లోయలో ఓ బైకర్ పడిపోయాడు. బైక్‌పై సరదాగా వెళ్తున్న బైకర్ వేగాన్ని అదుపు చేయలేక లోయలో పడిపోయాడు. అసలే అర్ధరాత్రి సమయం. బైకర్ లోయలో పడిపోయిన విషయాన్ని తెలుసుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ S.D.R.F. కటిక చీకట్లలోనూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆ బైకర్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి లోయలో పడిపోయిన విషయం తెలిసిన వెంటనే... ఆపరేషన్ ప్రారంభించి అతన్ని రక్షించినట్లు ఉత్తరాఖండ్ SDRF అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడిని తక్షణ వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించారు. మరో ప్రమాదంలోనూ ఉత్తరాఖండ్ SDRF ప్రయాణికులను రక్షించింది. 45 మంది భక్తులతో గురుద్వారా శ్రీ రీతా సాహిబ్‌కు వెళుతున్న బస్సు ధోన్ సమీపంలో బోల్తా పడింది. వెంటనే స్పందించిన SDRF.... రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ప్రయాణికులను రక్షించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com