
By - Bhoopathi |6 July 2023 10:15 AM IST
ప్రధాని మోదీ వరంగల్ టూర్‌ను సక్సెస్ చేసేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు బీజేపీ హైదరాబాద్ డివిజన్ అధ్యక్షులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. 8వ తేదీన ప్రధాని మోదీ వరంగల్ సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.డివిజన్ అధ్యక్షులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. సభకు కనీసం 2లక్షల మందిని తరలించేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గాలకు రాష్ట్ర స్థాయి నాయకులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com