కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది: ఎంపీ అర్వింద్

కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది: ఎంపీ అర్వింద్

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాపై బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందించారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని విమర్శించారు. గజ్వేల్‌ నుంచి ఈటల రాజేందర్‌ పోటీ చేస్తానని ప్రకటన చేయడంతో... కేసీఆర్‌ ముందు జాగ్రత్తగా రెండు చోట్ల పోటీకి దిగుతున్నారని అన్నారు. కామారెడ్డి నుంచి కాస్త ముందుకు వస్తే.. చిత్తు చిత్తుగా ఓడించేవాడినంటూ కామెంట్ చేశారు. బీఆర్‌ఎస్‌ లిస్టును చూస్తుంటే నిజామాబాద్‌ జిల్లాలో బీజేపీ క్లీన్ స్వీప్‌ చేయడం ఖాయమన్నారు.

Next Story