నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరోక్షంగా రఘునందన్‌రావు విమర్శలు

నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరోక్షంగా రఘునందన్‌రావు విమర్శలు

ఎంపీలు బఫూన్లంటూ వ్యాఖ్యలు చేసిన సినిమా కమెడియన్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు ...నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరోక్షంగా రఘునందన్‌రావు విమర్శలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం బీజేపీ ఆఫీసులో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో రఘునందన్‌రావు పాల్గొన్నారు. రిటైర్డ్‌ ఆర్మీ అధికారులు, సైనికులను సన్మానించారు. దళితుల భూములు లాక్కున్నట్లే .. జవాన్లకు ఇచ్చిన 3ఎకరాల భూములను కాజేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని రఘునందన్‌రావు ఆరోపించారు. దేశంలో అతి తక్కువ సమయం పాటు అసెంబ్లీ నడిపిన సీఎంగా కేసీఆర్ రికార్డ్‌ సాధించారని విమర్శించారు.

Next Story