
By - Subba Reddy |16 April 2023 1:45 PM IST
కర్ణాటక సీనియర్ బీజేపీ నేత, ఎమ్మెల్యే జగదీష్ శెట్టార్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేతో భేటీ అయిన ఆయన.. తన రాజీనామా సమర్పించారు. కర్ణాటకలోని సర్సి అసెంబ్లీ నుంచి శెట్టార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో విపక్ష నేత జగదీశ్ ఉన్నారు. రాష్ట్రంలో పార్టీని నిర్మించిన తనకు MLA టికెట్ కూడా లభించకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com