విపక్షాలపై విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

విపక్షాలపై విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రజా అంశాలు చర్చకు రాకుండా ప్రతిపక్ష కూటమి అడ్డుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ గొడవకు వత్తాసు పలికిన బీఆర్‌ఎస్‌.. చివరకు అవిశ్వాసంలో కలిసివెళ్లారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సమయంలో విపక్షాలు సభలో లేవని.. మరి అలాంటప్పుడు అవిశ్వాసం పెట్టడం దేనికని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తోక పార్టీలుగా బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ కూడా వాకౌట్‌ చేయడం చూశామన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి ఆడుతున్న నాటకం ఢిల్లీలో బహిర్గతమైందన్నారు.

Next Story