రాహుల్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న BJP మహిళా ఎంపీలు

రాహుల్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న BJP మహిళా ఎంపీలు

రాహుల్‌గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాహుల్‌పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ మహిళా ఎంపీలు. అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రసంగించిన రాహుల్‌.. ఆ సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఫ్లైయింగ్‌ కిస్ ఇచ్చారని బీజేపీ మహిళా ఎంపీలు ఆరోపించారు. స్మృతి ఇరానీ ప్రసంగిస్తున్న సమయంలో ఆమె పట్ల రాహుల్‌ అసభ్యకరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు బీజేపీ మహిళా ఎంపీలు. రాహుల్‌గాంధీ వీడియోను విడుదల చేయాలని స్పీకర్‌ను కోరారు.

Next Story