శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్‌ కాల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్‌ కాల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్‌ కాల్ రావడంతో.. CISF భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటిన ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేపట్టారు. డాగ్‌స్క్వాడ్‌తో సోదాలు చేశారు. అలాగే ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు.. బెదిరింపు కాల్ చేసింది ఎవరో గుర్తించారు. అయితే తన పిల్లలు పొరపాటున ఫోన్ చేశారని, జరిగిన తప్పుకు క్షమించాలని భద్రతా సిబ్బందిని కోరాడు. మొత్తానికి బాంబ్ బెదింపు కాల్ ఫేక్ అని తేలండతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Next Story