గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి కేసీఆర్‌ పోటీ

గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి కేసీఆర్‌ పోటీ

తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎన్నికల శంఖారావం మోగించింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ...115 స్థానాలకు సీఎం కేసీఆర్‌ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈ సారి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్‌ చెప్పారు. గజ్వేల్‌, కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్టు కేసీఆర్‌ చెప్పారు. అందులో ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. మంచి ముహూర్తం ఉండడంతో సోమవారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్టు కేసీఆర్‌ తెలిపారు.

Next Story