కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఫైర్

కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఫైర్

కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 86 వేల కోట్లు ఇచ్చామని పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పార్లమెంట్‌లో పట్టపగలు ప్రతిపక్ష పార్టీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేసిందని అన్నారు. కాంగ్రెస్ హయంలో రైతుల కళ్ళలో కన్నీరు వస్తే తెలంగాణ ప్రభుత్వంలో త్రాగు, సాగు నీరు వస్తుందని తెలిపారు.

Next Story