తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: నామా

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: నామా

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు.. తెలంగాణ పథకాలు బాగున్నాయంటూ.. దేశ మంతా అమలు చేసే మోదీ సర్కార్‌.. నిధుల విషయంలో మాత్రం మొండిచేయి చూపుతోందన్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు ఒక్కటీ అమలు చేయలేదన్నారు.. నవోదయ విద్యాలయాలు, ఐటీఐఆర్‌, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని నామా మండిపడ్డారు. నీతి అయోగ్‌ సిఫారసు చేసినా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.

Next Story