
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కాన్వాయ్‌లోకి ఓ కారు దూసుకొచ్చిన ఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆదివారం రాత్రి 8.09 గంటలకు వద్దకు వస్తున్నారు. ఇంతలో ఓ కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్‌లోని యూఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా మరో వాహనంపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటన జరిగినప్పుడు జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండటా.. ప్రెసిడెంట్ బైడెన్ 130 అడుగుల దూరంలో ఉన్నారు. డెలావేర్‌లోని తన ప్రచార ప్రధాన కార్యాలయం నుండి బయలుదేరిన బైడెన్ ఆశ్చర్యపోయారు. బైడెన్ నుండి 130 అడుగుల సమీపంలోని కూడలిలో ఉన్న సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని సెడాన్ కారు ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది. భద్రతా సిబ్బంది బైడెన్ ను వెయిటింగ్ వాహనంలో డౌన్‌టౌన్ విల్మింగ్టన్‌లోని భవనం నుండి దూరంగా తరలించారు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైట్‌హౌస్‌కు తరలించారు. దంపతులిద్దరు క్షేమంగా ఉన్నారని అధ్యక్ష భవన వర్గాలు వెల్లడించారు. కాగా, ఘటనకు పాల్పడిన డ్రైవర్‌ను సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com