
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ సోమవారం సీల్డాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్‌ను దాఖలు చేసింది. 200మందికి పైగా వ్యక్తుల నుంచి వాంగ్మూలం తీసుకున్న సీబీఐ, ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌గా తేల్చింది. రాత్రి విరామ సమయంలో దవాఖాన సెమినార్ హాల్‌లోకి వెళ్లిన వైద్యురాలిపై సివిక్ వలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఘాతుకానికి పాల్పడ్డాడని సీబీఐ తెలిపింది. గ్యాంగ్ రేప్ జరిగిందా? లేదా? మరికొంత మంది ప్రమేయం ఇందులో ఉందా? అన్నది తేల్చేందుకు ఇంకా దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ పేర్కొన్నది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ, దవాఖానలో విధుల్లో ఉన్న వైద్యురాలిపై లైంగికదాడి, హత్య ఘటన పశ్చిమ బెంగాల్‌ను తీవ్రంగా కుదిపేసింది. ఆగస్టు 9న వెలుగుచూసిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com