
By - jyotsna |2 Aug 2024 6:15 AM IST
నీట్ పేపర్ లీకేజీ కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. 13 మంది నిందితులపై చార్జ్‌షీటు దాఖలు చేసింది. నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అంతేకాకుండా నీట్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. కానీ అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి చార్జ్‌షీటును కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. సీబీఐ ఇప్పటి వరకు 40 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో 15 మంది బీహార్ వాసులే ఉన్నారు. మొత్తం 48 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com