
By - Vijayanand |1 Sept 2023 11:53 AM IST
ఒకే దేశం, ఒకే ఎన్నికలు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ 15 నుండి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చీఫ్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉండనున్నారు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఒక దేశం ఒక ఎన్నిక, యూనిఫామ్ సివిల్ కోడ్, మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com