IndiaToday Survey: నెల రోజుల్లో టీడీపీ గ్రాఫ్ మరింత పెరుగుతుందన్న చంద్రబాబు

IndiaToday Survey: నెల రోజుల్లో టీడీపీ గ్రాఫ్ మరింత పెరుగుతుందన్న చంద్రబాబు

ఎన్నికల సర్వేలపై మీడియా చిట్‌చాట్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే- సీ ఓటర్ సర్వే పై స్పందిస్తూ నెల రోజుల్లో టీడీపీ గ్రాఫ్ మరింత పెరుగుతుందన్నారు. ప్రజలు అభిప్రాయాలు వెల్లడించడానికి ఇంకా భయపడుతున్నారని అన్నారు. ప్రజలు భయం వదిలి స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి ఉంటే సర్వేలో టీడీపీకి ఉన్న ఆదరణ ఏంటో మరింత క్లారిటీ వచ్చేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలను జగన్ ఎంతగా నమ్మించే ప్రయత్నం చేసినా టీడీపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని చంద్రబాబు అన్నారు. రానురాను ప్రభంజనంగా మారడం ఖాయమన్నారు.

Next Story