శ్రీకాళహస్తి ఆలయంలో దళారుల రాజ్యం

శ్రీకాళహస్తి ఆలయంలో దళారుల రాజ్యం

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల గర్భాలయం దర్శనం చేయిస్తామంటూ..భక్తులను మోసం చేస్తున్న దళారుల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.పదిహేను వందలు ఇస్తే గర్భాలయం దర్శనం చేయిస్తాము అంటూ భక్తులను మోసం చేస్తున్నారు కొందరు దళారులు.ఇలా ఆలయానికి వచ్చిన భక్తులు అడుగున దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలను అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దళారుల అవతారంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా పాలక వర్గం పట్టించుకొవడం లేదని భక్తులు మండిపడుతున్నారు.

Next Story