RGV: ఆర్జీవీకి సీఐడీ నోటీసులు

RGV: ఆర్జీవీకి సీఐడీ నోటీసులు

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకి సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 10న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలని తాజాగా సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. కాగా విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను తీశారని వర్మపై గతంలోనే సీఐడీకి ఫిర్యాదులు అందాయి. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆర్జీవీ సినిమా తీశారంటూ పలు చోట్ల సీఐడీకి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో ఆర్జీవీపై కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి సీఐడీ నోటీసులు పంపింది. అయితే, ఆయన దీనిని హైకోర్టులో సవాల్ చేశారు.

సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై రాజకీయ దురుద్దేశంతో కేసు నమోదు చేశారని, ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని, తదుపరి చర్యలన్నింటినీ నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Next Story