జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణుల ప్రయత్నం

జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణుల ప్రయత్నం

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముట్టడి రణరంగమైంది. గన్‌ పార్క్‌ నుంచి ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ కార్యకర్తలు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో కాంగ్రెస్‌ నేతలు గ్రేటర్‌ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వరదల్లో జనం అల్లాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. హైదరాబాద్‌ వరద బాధిత కుటుంబహాలకు 10 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

Next Story